వకీల్‌సాబ్‌.. గర్వపడుతున్నా: నివేదా థామస్‌ - i am feeling proud to be part of this film
close
Published : 09/04/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వకీల్‌సాబ్‌.. గర్వపడుతున్నా: నివేదా థామస్‌

హైదరాబాద్‌: నివేదాథామస్‌, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఈ సినిమాతో తెరపై కనిపిస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’ గురించి నివేదా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు..

ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?

నివేదా: ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను. నా యోగక్షేమాలు అడిగినందుకు ధన్యవాదాలు.

పవన్‌కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

నివేదా: కమర్షియల్‌ హంగులు లేనప్పటికీ ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకుని ఇందులో భాగమైనందుకు పవన్‌ సర్‌కి ముందు థ్యాంక్స్‌ చెప్పాలి. ఆయనకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ కథ ఎంతోమందికి చేరువవుతుంది. ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఓ అద్భుత అనుభవాన్ని అందించింది.

వకీల్‌సాబ్‌లో మీకు నచ్చిన పాట?

నివేదా: మగువా మగువా

మీరు పోషించిన పాత్ర గురించి..?

నివేదా: ఇందులో నేను పల్లవి అనే సాధారణమైన అమ్మాయి పాత్ర పోషించాను. మిగతాది సినిమాలో చూడండి.

ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?

నివేదా: ‘పింక్‌’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్‌’లో భాగమైనందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ఆ కథను తెలుగువారికి చేరువయ్యేలా తెరకెక్కించడాన్ని గొప్ప బాధ్యతగా భావించాం.

ఈ సినిమా‌ షూటింగ్‌ డైరీస్‌లో మీకు గుర్తుండిపోయే ఓ విషయం?

నివేదా: ఒకటి కాదు ఎన్నో విశేషాలు ఉన్నాయి. కోర్టు రూమ్‌ సన్నివేశాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఇది‌ మీ కెరీర్‌లో బెస్ట్‌ చిత్రమవుతుందని నమ్ముతున్నారా?

నివేదా: ‌అవును.. తప్పకుండా అవుతుంది..

వేణుశ్రీరామ్‌ గురించి.. ?

నివేదా: ఆయనే మాకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని అందించారు. వేణుశ్రీరామ్‌కి ఓ పెద్ద హిట్‌ దక్కుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని