ఆస్పత్రిలో చేరిన అక్షయ్‌ - i am fine but hospitalised says akshay kumar
close
Published : 05/04/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్పత్రిలో చేరిన అక్షయ్‌

ముంబయి: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాను ఆస్పత్రిలో చేరానని తాజాగా ఆయన తెలియజేశారు. ‘నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞుడిని. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాను. అతి త్వరలో క్షేమంగా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి’ అని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ రెండో దశ  రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. మహారాష్ట్రలో దాని ప్రభావం తీవ్రంగా ఉంది. మరోవైపు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా దాని బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆమిర్‌ఖాన్‌, ఆలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌తోపాటు పలువరు తారలు కొవిడ్‌-19 బారిన పడినట్లు ప్రకటించగా.. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అక్షయ్‌కుమార్‌, గోవింద ట్వీట్లు పెట్టారు. అలాగే ఈ మధ్యకాలంలో తనని కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అక్షయ్‌ సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని