NTR Corona: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా! - i am getting better says ntr
close
Published : 14/05/2021 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR Corona: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా!

హైదరాబాద్‌: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. ‘ప్రతి ఒక్కరికీ రంజాన్‌ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తా. సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ పెట్టారు.

ఈ నెల 10న ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి.. ఎన్టీఆర్‌కి ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తారక్‌ కొవిడ్‌-19 బారిన పడ్డారని తెలుసుకున్న అభిమానులు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. అంతేకాకుండా త్రివిక్రమ్‌, ప్రశాంత్‌నీల్‌తోనూ తారక్‌ సినిమాలు చేయనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని