వారిపై కోర్టుకు వెళ్తా: నటి రాధిక - i am not down with corona says radhika
close
Updated : 09/04/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిపై కోర్టుకు వెళ్తా: నటి రాధిక

చెన్నై: తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టిస్తున్న వారిపై  కోర్టుకు వెళ్తానని ప్రముఖ నటి రాధిక అన్నారు. గత కొన్నిరోజుల నుంచి తన ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో ఎన్నో పుకార్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాధిక ఓ ట్వీట్‌ పెట్టారు. ‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు కరోనా వైరస్‌ సోకలేదు. వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వృత్తిపరమైన జీవితంలో బిజీ అయ్యాను. ఆరోగ్యం గురించి కొంతమంది ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారు. ఈ పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తా’ అని ఆమె తెలిపారు. రాధిక కొవిడ్‌-19 బారిన పడ్డారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ దేశవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తోంది. దానిని అడ్డుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని