భారతీయులకు ప్రియాంక చోప్రా అభ్యర్థన - i beg you to stay home priyanka chopra
close
Published : 21/04/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారతీయులకు ప్రియాంక చోప్రా అభ్యర్థన

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా విచారం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు ఒక సూచన చేశారు. అత్యవసరమైతే తప్ప దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని కోరారు. గత రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ కరోనా విజృంభించిందని అన్నారు.

‘దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను వార్తల్లో చూస్తుంటే భయంగా ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. దయ చేసి అందరూ ఇళ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, స్నేహితులు, పక్కింటి వాళ్లు, బంధువులు, మన ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం దీన్ని పాటించండి.  బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ ధరించండి. పరిస్థితిని అర్థం చేసుకుని మీ చుట్టు పక్కల ఉన్నవారికి సాయం చేయండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పక వ్యాక్సిన్‌ తీసుకోండి. మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన వైద్య రంగంపై ఒత్తిడిని తగ్గిస్తాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమె రిచర్డ్‌ మాడెన్‌తో కలిసి ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ చిత్రీకరణ లండన్‌లో జరుగుతోందని, సెట్లో రిచర్డ్‌తో కలిసి గడపడం చాలా సరదాగా ఉందని తెలియజేసింది. ఆమె ఇప్పుడీ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్‌ 4’లోనూ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని