Dhanya Balakrishna: నేను మందు తాగలేదు.. - i did not drink alcohol that movie says dhanya
close
Published : 15/05/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhanya Balakrishna: నేను మందు తాగలేదు..

హైదరాబాద్‌: చూడడానికి తెలుగు అమ్మాయిలా కనిపించి.. ఇక్కడ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న బెంగళూరు చిన్నది ధన్య బాలకృష్ణ. ‘లవ్‌ ఫెయిల్యూర్‌’తో నటిగా తెలుగు వారికి పరిచయమైన ఈమె పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు. ‘నేను శైలజా’, ‘రాజు గారి గది’, ‘రాజా రాణీ’, ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. లాక్‌డౌన్‌ కారణంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ధన్య తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం...

మేడమ్‌.. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

బెంగళూరు

మీ క్రష్‌ ఎవరు?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూర్య, రణ్‌బీర్‌ కపూర్‌

నటి కాకపోయి ఉండి ఉంటే..

ప్రపంచంలోనే గొప్ప ప్రేమికురాలిని అయ్యేదాన్ని.

చికెన్‌ బిర్యానీ లేదా మటన్‌ బిర్యానీ.. ఏది ఇష్టం?

వెజ్‌, పెరుగన్నం

మీ రోజువారి దినచర్య?

వంట చేయడం, పుస్తకాలు చదవడం,  ఇల్లు శుభ్రం చేయడం, కాఫీ, లూడో ఆడుకోవడం, నిద్రపోవడం, నాన్నతో సరదాగా గొడవ పడడం, అలాగే అమ్మానాన్నల సరదా ఫైట్స్‌ చూడడం.. ఆ తర్వాత వాళ్లని కౌగిలించుకుని గుడ్‌నైట్‌ చెప్పడం.

‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’లో మహేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

సూపర్బ్‌! ఆయన ఎంతో మంచి మనస్సున్న, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.

ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమా ఏది?

టైటానిక్‌

అజిత్‌ లేదా విజయ్‌?

నాకు ఇద్దరూ ఇష్టమే

మీ ముద్దుపేరు ఏమిటి?

పప్పు

మీ జీవితంలో ఏది జరిగినందుకు ఎక్కువగా సంతోషిస్తున్నారు?

నా తల్లిదండ్రులు , స్నేహితులు, నా వర్క్‌, అంతకంటే ముఖ్యంగా నా పాత్రలన్నింటినీ గుర్తుపెట్టుకుని నన్ను ఎంతో సపోర్ట్‌ చేస్తున్న మీలాంటి అభిమానులు నా జీవితంలో ఉన్నందుకు ఆనందిస్తున్నా

‘రాజారాణీ’లో మీ హావభావాలు చాలా బాగుంటాయి?

అవునా!! ధన్యవాదాలు.

సౌందర్య చిట్కాలు ఏమైనా చెప్పగలరు?

శుభ్రంగా తినండి. పాజిటివ్‌గా ఆలోచించండి. మంచిగా మాట్లాడండి.

సినీ రంగంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని విశేషం ఏమిటి?

‘As I Am Suffering from Kadhal’ ఈ ప్రోగ్రామ్‌లో నా నటన చూసిన తర్వాత   ప్రముఖ నటి సిమ్రన్‌ నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. అలాగే, నా నటన ఎంతో సహజంగా ఉంటుందని ఇటీవల ప్రభుదేవా మాస్టర్‌ ప్రశంసించారు.

కన్నడలో మీ అభిమాన హీరో ఎవరు?

పునీత్‌

మీరు అంత అందంగా ఎలా పుట్టారు?

హీహీ!! శారీరకంగా మనం ఇలా ఉన్నామంటే కారణం మన జీన్స్‌. అది మన చేతుల్లో లేదు. మంచి మనస్సున్న, దయ కలిగిన వ్యక్తిగా జీవించడం అనేది ఎంతో అందమైన విషయం.

మీ వాట్సాప్‌ నంబర్‌ ఇస్తారా?

నో. నేను ఇవ్వనుగా

మీ రియాక్షన్స్‌కి నేను వీరాభిమానిని?

ఓ నిజమేనా??!!

క్వారంటైన్‌ అయిపోయాక మీరు వెళ్లాలనుకునే ప్రాంతమేది?

అమెరికా

ఇష్టమైన ఆహారం?

నూడిల్స్‌! రోడ్డు పక్కన బండి మీద దొరికేది అంటే నాకు ఎంతో ఇష్టం. అది కూడా ఎక్కువ ఘాటుగా చేయించుకుని తింటాను.

టెక్నాలజీ లేదా వింటేజ్‌?

వింటేజ్‌!! ఎందుకంటే నాకు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో సరిగ్గా తెలీదు.

ఏవిధమైన భోజనాన్ని తినడానికి ఆసక్తి కనబరుస్తుంటారు?

మామిడికాయపచ్చడి, బంగాళదుంప కూర, సాంబారు, అన్నం.

నిన్ను డేట్‌కి తీసుకువెళ్లాలనుకుంటున్నాను? నిన్ను ఎలా ఇంప్రెస్‌ చేయాలో చెప్పవా?

హ్హాహ్హాహ్హా

‘రాజారాణీ’లోని పాత్రని మీ నిజ జీవితంతో సరిపోల్చవచ్చా?

ఆ సినిమాలో నేను మద్యం సేవించినట్లు చూపించారు. అది నిజం కాదు. కేవలం మంచినీళ్లు మాత్రమే!! నేను ఎక్కువగా పార్టీలు చేసుకోను. కానీ ప్రతి వారాంతంలో నా స్నేహితుల్ని కలిసి వాళ్లతో భోజనానికి వెళ్తాను. లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి  వెళ్తాను.

ఒక డ్యాన్స్‌ వీడియో పోస్ట్ చేయవచ్చుగా!

దానికంటే ముందు డ్యాన్స్‌ గురించి నాకు తెలియాలి కదా!!

మీ క్రెడిట్‌ కార్డు నంబర్‌? దానిని సీవీవీ నంబర్‌ చెప్పరా?

అది మీకు ఎందుకు?



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని