Shruti Haasan.. వాళ్ల సాయం కోరను - i don’t have daddy or mommy helping me says shruthi hassan
close
Published : 12/05/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shruti Haasan.. వాళ్ల సాయం కోరను

హైదరాబాద్‌: స్టార్‌హీరో కుమార్తెగా వెండితెరకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్‌. అటు గాయనిగానూ సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా దేశంలో ఉన్న పరిస్థితుల గురించి స్పందించారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ కారణంగా తాను కూడా ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపారు. తన ఆలోచనలకు గౌరవం ఇచ్చి అమ్మానాన్న కూడా ఈ విషయంలో సాయం చేయరని ఆమె అన్నారు.

‘‘ఇటీవల నేను సొంతంగా ఓ ఇంటిని కొనుగోలు చేశాను. దాంతో ప్రతినెలా నేను సంపాదించిన దానిలో కొంత ఈఎంఐ కడుతున్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల షూటింగ్స్‌, నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నాకు వేరే వాళ్లపై ఆధారపడడం ఇష్టం ఉండదు. నేను స్వతంత్ర భావాలున్న మహిళను. దానివల్ల అమ్మానాన్న సైతం నాకు సాయం చేయరు. నాకూ వాళ్ల సాయం పొందడం ఇష్టం లేదు. పరిస్థితులన్ని చక్కబడి మళ్లీ సాధారణ రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ షూటింగ్స్‌ కనుక ప్రారంభిస్తే వెంటనే నేను సెట్‌లో వాలిపోతాను. ఎందుకంటే అలా అయినా కొంతవరకూ ఆర్థికంగా నిలదొక్కుకుంటాను’’ అని శ్రుతిహాసన్‌ వివరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని