విమర్శలపై సమాధానమిచ్చిన సుమలత
బెంగళూరు: తన తనయుడి సినిమా చిత్రీకరణ కోసం అధికార దుర్వినియోగం చేయలేదని ఎంపీ, ప్రముఖ నటి సుమలత అన్నారు. అంబరిష్-సుమలత దంపతుల కుమారుడిగా వెండితెరకు పరిచయమై కన్నడ చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభిషేక్. ప్రస్తుతం అభిషేక్ తన రెండో సినిమా ‘బ్యాడ్ మ్యానర్స్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ మండ్యాలోని మైషుగర్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. కొంతకాలంగా మూసి ఉన్న ఈ ఫ్యాక్టరీలో సినిమా షూట్ నిర్వహించడం పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సుమలత కారణంగానే మూసివున్న ఫ్యాక్టరీలో చిత్రీకరణకు అవకాశమిచ్చారంటూ పలువురు విమర్శలు చేశారు.
వీటిపై తాజాగా సుమలత స్పందించారు. ‘బ్యాడ్ మ్యానర్’ చిత్రీకరణ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని అన్నారు. ‘ఇలాంటి నిరాధర ఆరోపణలు ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదు. షుగర్ ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారనే విషయం నాకు తాజాగా తెలిసింది. ఫ్యాక్టరీలో షూట్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులను చిత్రబృందం ముందే జిల్లా యంత్రాంగం నుంచి తీసుకుంది. కాబట్టి నియమాలను ఉల్లంఘించారు అని చెప్పడానికి ఎలాంటి కారణాల్లేవు. స్థానిక ఆర్థిక వ్యవస్థను, పర్యాటకాన్ని సినిమా చిత్రీకరణలు మరింత వృద్ధి చేస్తాయి’ అని సుమలత వివరించారు.
ఇదీ చదవండి..
స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
- పవన్ భార్యగా సాయిపల్లవి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’