విజయ్‌ శంకర్‌ కష్టాలు తెలుసన్న యాష్‌ - i know vijay shankar struggles better than any one else says ravichandran ashwin
close
Published : 02/06/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ శంకర్‌ కష్టాలు తెలుసన్న యాష్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఇబ్బందులు తనకు తెలుసని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడు వరుస గాయాలతో సతమతం అవుతున్నాడని తెలిపాడు. కొందరు గాయాల పట్ల సున్నితంగా ఉండలేరని పేర్కొన్నాడు. చక్కగా ఆడగల అనుభవం శంకర్‌కు ఉందని వెల్లడించాడు.

తమిళనాడుకు చెందిన విజయ్‌ శంకర్‌ 2019 వన్డే ప్రపంచకప్‌లో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేస్తాడు కాబట్టి ‘3డీ’ ఆటగాడిగా పేరుపడ్డాడు. అయితే టోర్నీలో ఆశించిన మేరకు అతడు రాణించలేదు. దాంతో ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. పునరాగమనం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్ల కోసం టీమ్‌ఇండియా ఇంకా వెతుకుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

‘విజయ్‌ మంచి ఆటగాడు. ప్రపంచకప్‌ ఆడాడు. అతడికి చాలా అనుభవం ఉంది. అతడు చాలాసార్లు గాయపడ్డాడు. అతడి గాయాల గురించి నాకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు ఆటగాళ్లు వాటిపట్ల సున్నితంగా ఉండరు. శంకర్‌ కచ్చితంగా ఇబ్బంది పడ్డాడు. అతడో పరిష్కారం కనుగొని వాటి నుంచి బయటపడతాడు’ అని యాష్‌ అన్నాడు.

‘వయసు పెరుగుతుంటే గాయపడకుండా ఉండటం కష్టం. ఇప్పుడు విజయ్‌ 30-31 ఏళ్ల మధ్య ఉన్నాడు. మరి వయసు పెరుగుతుంటే గాయాలతో కష్టమే కదా. తమిళనాడు జట్టులో ఆటగాళ్లకు సరైన పాత్రలు ఇవ్వాలి. కుర్రాళ్లు, సీనియర్లతో జట్టును సమతూకంగా ఉంచాలి. మేం విజయ్‌ శంకర్‌ అనుభవాన్ని ఉపయోగించుకొంటాం. కుర్రాళ్లతో కలుపుగోలుగా ఉంటాం. జట్టు సమతూకం పెరిగే కొద్దీ వారికి మరిన్ని అవకాశాలు ఇస్తాం’ అని అశ్విన్‌ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని