close
Published : 08/04/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సురేందర్‌కి సరెండరయ్యా: అఖిల్‌

హైదరాబాద్‌: అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీనికి ‘ఏజెంట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని అఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ‘నాలోని ఓ కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా! సురేందర్‌రెడ్డి నన్ను ఇలా తీర్చిదిద్దారు. ఇక అధికారికంగా నేను ఆయనకి సరెండర్‌ అయ్యాను. మా చిత్ర నిర్మాత అనిల్‌ సుంకరకు ధన్యవాదాలు’ అని అఖిల్‌ పేర్కొన్నారు.

‘అఖిల్‌’, ‘మిస్టర్‌ మజ్ను’, ‘హలో’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాల తర్వాత అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఐదో చిత్రమిదే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని