Sonu Sood: ఉచిత వైద్యం అందించడమే నా కల - i want to build a hospital for free treatment says sonusood
close
Published : 14/06/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sonu Sood: ఉచిత వైద్యం అందించడమే నా కల

ముంబయి: అందరికీ ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు ఏర్పాటు చేయడమే తన కల అని ప్రముఖ నటుడు, రియల్‌హీరో సోనూసూద్‌ తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది సామాన్య ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చి.. తన వంతు సాయం అందిస్తున్న సోనూసూద్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి స్పందించారు.

‘కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లను చూసి నా మనసు చెలించిపోయింది. చేతనైనంత సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఈ సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం నాకు అండగా ఉంది. నా భార్య, పిల్లల సోషల్‌మీడియా ఖాతాలకు సైతం సాయం కోరుతూ ఎంతోమంది మెస్సేజ్‌లు పంపుతున్నారు. వాటిని చూసిన వెంటనే వాళ్లు నాకు చెబుతున్నారు. అలా వాళ్లు కూడా నాకు సపోర్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ఉంది. కానీ, అది ఇప్పుడే సాధ్యం కాని పని. ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు మాత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తప్పకుండా అది చేస్తాను’ అని సోనూ తెలిపారు.

కాళ్లు పట్టుకుని.. కన్నీళ్లు పెట్టుకుని

క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిషేక్‌ జైన్‌ అనే కుర్రాడికి సోనూసూద్‌ని కలవాలనే కోరిక ఉంది. అభిషేక్‌ చిరకాల ఆకాంక్షను తెలుసుకున్న ఓ సేవా సంస్థ నిర్వహకులు.. అతడిని సోమవారం ఉదయం సోనూసూద్‌ ఇంటికి తీసుకువెళ్లారు. సోనూని చూసిన వెంటనే అభిషేక్‌ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాళ్లు పట్టుకుని నమస్కారం చేశాడు. అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సోనూ.. అతడికి ఓ చిన్న కానుక అందించి ఇంటికి పంపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని