26 కథలు రిజెక్ట్‌ చేశా: అఖిల్‌ - i was rejected 26 stories says akhil
close
Updated : 16/04/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

26 కథలు రిజెక్ట్‌ చేశా: అఖిల్‌

హైదరాబాద్‌: బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే ఓ రియాల్టీ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు నటుడు అఖిల్‌ సార్థక్‌‌. గతంలో పలు ధారావాహికల్లో నటించిన అఖిల్‌.. ఇప్పుడు కథానాయకుడిగా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫస్ట్‌ టైమ్‌’. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హేమంత్‌ దర్శకుడుగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రియాల్టీ షో నుంచి రన్నరప్‌గా బయటకు వచ్చిన తర్వాత తనకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలిపారు. సుమారు 26 కథలు విన్నానని.. నచ్చకపోవడంతో రిజెక్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ‘ఫస్ట్‌ టైమ్‌’ కథ తనకి ఎంతో నచ్చిందని.. ఈ సినిమాలో ఎన్నో విశేషాలున్నాయని, స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పేశానని అఖిల్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని