డైరెక్టర్‌ చేసిన పనితో షాకయ్యా!  - i will never forget that day in my dubbing life says sunitha
close
Published : 05/05/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డైరెక్టర్‌ చేసిన పనితో షాకయ్యా! 

ఇప్పటికీ దానిని మర్చిపోలేను: సునీత

హైదరాబాద్‌:  ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో  దర్శకుడు చేసిన పనితో తాను మొదట షాకయ్యానని ప్రముఖ గాయని సునీత అన్నారు.  తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌ గురించి  కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అంటే తనకెంతో అభిమానమని.. ఆయన ఆధ్వర్యంలో 40 చిత్రాలకు పాటలు పాడానని ఆమె తెలిపారు.

అనంతరం.. ‘ఏదైనా చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో మీరు ఎదుర్కొన్న, ఎప్పటికీ మర్చిపోలేని ఓ సరదా సంఘటనను తెలియచేయగలరు?’ అని ప్రశ్నించగా... ‘‘సరదా సంగతులంటే ఏమీ జరగలేదు కానీ..  గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం కోసం స్టూడియోకి వెళ్లాను. స్టూడియో లోపలకి వెళ్లగానే ఆ చిత్ర దర్శకుడు.. ‘సునీత మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. నా సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది ’ అని అన్నాడు.  కొన్ని సీన్లు డబ్బింగ్‌ చెప్పిన అనంతరం ఆయన నన్ను ‘సునీత గారు’ అని పిలవడం ప్రారంభించారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మరికొద్దిసేపటి తర్వాత ‘సునీత’ అని పిలిచారు. అలా కొంత డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి ఆయన నన్ను .. ‘అరేయ్‌, అమ్మా, బుజ్జి, కన్నా’’ అనడంతో నేను షాక్‌ అయ్యాను. ఈయనేంటి మేడమ్‌ దగ్గర ప్రారంభించి ఉన్నట్టుండి కన్నా, బుజ్జి అంటున్నాడు? ఇప్పుడు నేను ఎలా స్పందించాలి? అనుకున్నాను.  అదృష్టం కొద్ది ఆ తర్వాత మళ్లీ ఆయన్ని కలవలేదు’ అని సునీత ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని