విజయ్ దేవరకొండ
హైదరాబాద్: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూట్ ముంబయిలో తిరిగి ప్రారంభమయ్యింది. విజయ్‌తోపాటు అనన్యా పాండే, రమ్యకృష్ణ షూట్లో పాల్గొంటున్నారు. ‘లైగర్’ షూట్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు.
‘లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో కొన్నినెలలు ఇంటికే పరిమితమయ్యాను. అందుకే ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా షూట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని పూరీకి కూడా చెప్పాను. కావాలంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా వరుసగా చిత్రీకరణలో పాల్గొనడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే.. హోటల్‌కి కూడా వెళ్లకుండా ‘లైగర్’ సెట్లోనే నిద్రపోతానని దర్శక, నిర్మాతలతో చెప్పాను’ అని విజయ్ దేవరకొండ వివరించారు.
బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘లైగర్’ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
- పవన్ భార్యగా సాయిపల్లవి!
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది