చాలా మందికి సాధ్యం కానిది.. పంత్‌ చేశాడు - ian chappell lauded rishabh pant for his heroics batting in three tests
close
Published : 15/03/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాలా మందికి సాధ్యం కానిది.. పంత్‌ చేశాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో అలా చేయలేరని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ పేర్కొన్నాడు. తాజాగా పంత్ గురించి ఓ క్రీడా ఛానెల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ ఆస్ట్రేలియా పర్యటనలో.. సిడ్నీ టెస్టులో 97, గబ్బా టెస్టులో 89*, తాజాగా ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో 101 శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడే పంత్‌ ఆదుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే యువ క్రికెటర్‌పై ఆసీస్‌ మాజీ సారథి ప్రశంసలు జల్లు కురిపించాడు. ‘జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి పంత్‌ మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడు. చాలా మంది తమ కెరీర్‌ మొత్తంలో కూడా ఇలా చేయలేరు. అయితే, ఈ యువ క్రికెటర్‌ తన దూకుడు బ్యాటింగ్‌తోనే కాకుండా కీపింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. పంత్‌ టీమ్‌ఇండియాలో పేరొందిన ఆటగాడు. అతడి స్ఫూర్తి, జట్టు ఆత్మవిశ్వాసానికి సరైన నిర్వచనం. ఇంగ్లాండ్‌లోనూ ఇలాంటి ఆటగాళ్లున్నారు. కానీ వారికి సరైన పరిస్థితులు అనుకూలించలేదు’ అని ఛాపెల్‌ వివరించాడు. ఇక తాజా టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి ప్రయత్నిస్తే.. ఇంగ్లిష్‌ క్రికెటర్లు వికెట్లు కాపాడుకునేందుకు యత్నించారని చెప్పాడు. ఇదే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అని ఆసీస్‌ మాజీ పేర్కొన్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని