Team India: ఆ మ్యాచ్‌లు ఫిక్స్‌ అవ్వలేదు  - icc confirms the matches team india played against england and australia in 2016 2017 were not fixed
close
Published : 18/05/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: ఆ మ్యాచ్‌లు ఫిక్స్‌ అవ్వలేదు 

ఐసీసీ విచారణలో నిగ్గుతేలిన నిజాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో టీమ్‌ఇండియా ఆడిన రెండు టెస్టుల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని అల్‌జజీరా అనే వార్తా ఛానెల్‌ రూపొందించిన డాక్యుమెంటరీలో నిజం లేదని ఐసీసీ సోమవారం తేల్చిచెప్పింది. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్టు, 2017లో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మరో టెస్టులో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందనే నేపథ్యంలో 2018లో ‘క్రికెట్స్‌ మ్యాచ్‌ ఫిక్సర్స్‌’ పేరిట సదరు ఛానెల్‌ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అయితే, దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఐసీసీ.. నలుగురు స్వతంత్ర (బెట్టింగ్‌, క్రికెట్‌ విశ్లేషకులను) సభ్యులతో ఎంపిక చేసి ఆ కార్యక్రమంపై విచారణ చేయించింది.

ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా ఆడిన ఆ రెండు టెస్టుల్లో ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగూ జరగలేదని ఆ నలుగురూ  తమ అభిప్రాయాలను వెల్లడించారని ఐసీసీ పేర్కొంది. ఆ ఛానెల్‌ ప్రసారం చేసిన కార్యక్రమంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ దొరకలేదని.. అది కేవలం కల్పితం, నమ్మశక్యం కాని విధంగా రూపొందించిందని నిపుణులు చెప్పారని తెలిపింది. అయితే, ఆ డాక్యుమెంటరీలో పాల్గొన్న ఐదుగురిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. సరైన ఆధారాలు లేని కారణంగానే వారిని విడిచిపెట్టినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని