ఐసీసీ మహిళల క్రికెట్‌లో కొత్త అడుగు - icc expands womens teams for the icc events from 2026 year
close
Published : 09/03/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసీసీ మహిళల క్రికెట్‌లో కొత్త అడుగు

దుబాయ్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఐసీసీ మహిళల క్రికెట్‌కు సంబంధించి కొత్త అడుగు ముందుకేసింది. 2026 నుంచి జరిగే ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ టోర్నీల్లో మరిన్ని జట్లను చేర్చనున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో పది జట్లు ఆడుతుండగా, 2026 నుంచి 12 జట్లు పోటీపడతాయని తెలిపింది. అలాగే వన్డే ఫార్మాట్‌లో ఎనిమిది జట్లకు బదులు పది జట్లు ఆడతాయని వివరించింది.

ఇక రాబోయే వన్డే ప్రపంచకప్‌తో పాటు, 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ ఇప్పుడున్న జట్లే పోటీపడతాయని ఐసీసీ స్పష్టం చేసింది. మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి గత నాలుగేళ్లుగా కృషి చేస్తున్నామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు చేరువ చేయడానికి బ్రాడ్‌కాస్టర్లతో పెట్టుబడులు పెడుతున్నామని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మనుసాహ్నే చెప్పారు. గతేడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌కు విశేష ఆదరణ లభించిందని.. రికార్డు స్థాయిలో 1.1 బిలియన్ల మంది ఆన్‌లైన్‌లో ఆ టోర్నీని వీక్షించారన్నారు. కాగా, నేరుగా స్టేడియానికి వచ్చి వీక్షించిన వారి సంఖ్య 86,174గా నమోదైంది. దీన్ని బట్టి మహిళ క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని మను పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని