ఆయన లేకపోతే నాకు సాధ్యం అయ్యేది కాదు - if not for the support of vijay sir it would have been impossible for me to do this character
close
Published : 24/03/2021 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన లేకపోతే నాకు సాధ్యం అయ్యేది కాదు

అరవింద్‌ స్వామి

చెన్నై: ప్రముఖ విలక్షణ నటుడు అరవింద్‌ స్వామి కీలకపాత్రలో నటించిన చిత్రం ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో కంగనారనౌత్‌ ప్రధాన పాత్రలో నటించారు. అరవింద్‌స్వామి ఎంజీఆర్‌గా కనిపించనున్నారు. ఏప్రిల్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘తలైవి’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

‘‘ఎంతో టాలెంట్‌ ఉన్న నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు దర్శకుడు విజయ్‌కి ధన్యవాదాలు. ఆయన సపోర్ట్‌, ఇచ్చిన ధైర్యం వల్లనే నేను ఆ పాత్రలో నటించగలిగాను. ఆయనే లేకపోతే ఆ పాత్రలో అంత చక్కగా లీనమవ్వడం నా వల్ల అయ్యేది కాదు. కంగనా రనౌత్‌, మధు, నాజర్‌, తంబి రామయ్య లాంటి నటీనటులతో చాలారోజుల తర్వాత స్క్రీన్‌ పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని అరవింద్‌ స్వామి తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని