లక్షలాది మంది మనసులను కదిలించే రాజా - ilaiyaraaja connects millions of minds: kamal haasan
close
Published : 02/06/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 లక్షలాది మంది మనసులను కదిలించే రాజా

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా నేడు తన 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అవన్నీ చాలా వరకు అఖండ విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ఆయన సంగీతం సమకూర్చిన ‘స్వాతి ముత్యం’, ‘నాయగన్’, ‘తేవర్ మగన్’, ‘అంజలి’, ‘గురు’, ‘హే రామ్’ వంటి సినిమాలను భారత్‌ నుంచి ఆస్కార్‌కి నామినేట్ చేశారు. కమల్‌హాసన్‌ ఇళయరాజాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘‘ఎంతోమంది మనసులకు నచ్చినవాడు.. లక్షలాది మంది మనసులను కలిపే మాస్ట్రో ఇళయరాజాకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కమల్‌ నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాస్ట్రో సంగీత స్వరాలు అందించి, విజయానికి బాసటగా నిలిచారు. ‘అన్నాకిలి’ (1976) సినిమాతో ఇళయరాజా స్వరకర్తగా అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 1978లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. ఇదే సినిమాని తెలుగులో ‘రామ చిలక’ (1978)గా రీమేక్ చేశారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని