మనవరాలికి ఇళయరాజా సంగీత పాఠాలు! - ilayaraja teaches how to play piano
close
Published : 02/05/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనవరాలికి ఇళయరాజా సంగీత పాఠాలు!

చెన్నె: సంగీత దిగ్గజం ఇళయరాజా దగ్గర సరిగమలు నేర్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు! బుడిబుడి అడుగులు వేసే వయసులోనే నేనూ నేర్చుకుంటా తాతా అంటూ ఆయన మనవరాలు (సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా కూతురు) అడిగిందేమో. వెంటనే పియానోతో సరాగాలు పలికించడం ఎలానో ఈ చిన్నారికి నేర్పించే ప్రయత్నం చేశారు ఇళయరాజా. ఈ విశేషాన్ని తన ఫోన్‌లో బంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు యువన్‌ శంకర్‌ రాజా. ఈ వీడియో చూసిన గాయనీగాయకులు, నటులు బాగుంది అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా విషయానికొస్తే.. తెలుగులో ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఇళయరాజా. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న సినిమా ఇది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని