కరోనా: వారిలో కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యం! - immune system may evolve to fight coronavirus variants
close
Updated : 24/01/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: వారిలో కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యం!

కోలుకున్న వారిలో 6నెలల కంటే ఎక్కువ కాలం రక్షణ

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి దీర్ఘ కాలం ఉండడంతో పాటు కొత్తరకం వైరస్‌లను కూడా నిరోధించగలిగే సామర్థ్యం ఉన్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. అంతేకాకుండా, రోగనిరోధకశక్తితో వచ్చే యాంటీబాడీలు ఎక్కువకాలం పాటు ఉండడం, కొత్తరకాలను ఎదుర్కొనే సామర్థ్యాలను కలిగి ఉండటం ఊరట కలిగించే విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కణాల్లో దాగి ఉండే వైరస్‌ అవశేషాల వల్ల ఇది సాధ్యమయ్యే ఆస్కారం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌ మహమ్మారి ‌నుంచి కోలుకున్న వారిలో వ్యాధికి కారణమైన వైరస్‌ను రోగనిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకోవడంతో పాటు యాంటీబాడీల పనితీరును దీర్ఘకాలం మెరుగుపరుస్తుందని అమెరికాకు చెందిన రాకేఫెల్లర్‌ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తాజా పరిశోధన బలమైన సాక్ష్యాలను అందిస్తోందన్నారు. 87 మంది రోగులపై పరిశోధన జరిపిన అధ్యయనం తాజాగా నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా, వైరస్‌ సోకిన నెల తర్వాత బాధితుల యాంటీబాడీల స్థాయిని పరీక్షించిన నిపుణులు, మరో ఆరు నెలల అనంతరం వాటి ప్రతిస్పందనలను పరీక్షించారు. యాంటీబాడీల పరిమాణం తగ్గినప్పటికీ, కీలకమైన మెమొరీ బీ కణాల్లో తగ్గుదల కనిపించలేదని నిపుణులు గుర్తించారు. అంతేకాకుండా, కొన్నిసమయాల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరడగమే కాకుండా..అసలైన వాటికంటే ఈ యాంటీబాడీలకే ఎక్కువ సమర్థత ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా, కోలుకున్న వారు మరోసారి వైరస్‌కు గురైనప్పుడు ఇవి వేగంగా ప్రతిస్పందించడమే కాకుండా, వాటిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణులు మైఖేల్‌ సీ నుస్సేన్‌స్వీగ్‌ అంచనా వేశారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో వృద్ధిచెందే యాంటీబాడీలు కొంతకాలానికి క్షీణించిపోతాయని ఇదివరకు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, ఇలా ఎల్లవేళలా యాంటీబాడీలు వృద్ధి చెందడానికి బదులు కరోనా వైరస్‌ను గుర్తించే మెమొరీ బీ కణాలను రోగనిరోధక వ్యవస్థ తయారు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీంతో మరోసారి వైరస్‌ సోకినప్పుడు వాటిపై దాడి చేయడానికి ఇవి సిద్ధంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా కొత్తరకం వైరస్‌లపైనా సమర్థంగా పనిచేయగలవనే నమ్మకాన్ని శాస్త్రవేత్తలు వెలిబుచ్చారు.

ఇవీ చదవండి..
భారత్‌ టీకా మాకు సంజీవని
కొవిడ్‌ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని