అడ్డంకులను అధిగమించాలి:  మానుషి చిల్లర్‌ - imperative we tell girls to feel positive about their bodies manushi chhillar
close
Published : 06/03/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 అడ్డంకులను అధిగమించాలి:  మానుషి చిల్లర్‌

ముంబయి: ‘అమ్మాయిలంతా మానసిక అడ్డంకులు అధిగమించడానికి సిద్ధంగా ఉండాలని’’ చెబుతోంది, మాజీ మిస్‌ వరల్డ్‌ - బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌. తాజాగా ఆమె సమానత్వంపై అవగాహన పెంపొందించడానికి స్క్వాష్ ఏష్‌ దీపికా పల్లికల్, ఇండియన్‌ బాక్సర్‌ నిఖాత్ జరీన్‌లో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మానుషి మాట్లాడుతూ..‘‘మానసిక, శారీరక సమస్యలు అధిగమించడానికి అమ్మాయిలంతా ఎల్లప్పుడూ సిద్ధంగా, సానుకూలంగా ఉండాలి. జీవితం పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకోవడం కోసం మహిళల విజయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘మేక్‌ ఏ మూవ్‌’ పేరుతో ఈ ప్రచారాన్ని దేశమంతటా ఉన్న యువతుల దగ్గరకు చేర్చి, వారి ఆశయాల్ని, కలలను ప్రేరేపించాలి. శారీరక, సాంస్కృతిక, మానసిక అవరోధారాలు ఉన్నప్పటికీ, సమానత్వ ఉద్యమం వారి జీవితంలో ఓ భాగమని చాటడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల కథలను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇలాంటి ప్రచారమే యువతలు విజేతలు అయ్యేలా చేస్తుందని’’ తెలిపారు.

ప్రస్తుతం మానుషి చిల్లర్‌ - అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘పృథ్వీరాజ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. చంద్రప్రకాష్ ద్వేవేది చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది కోవిడ్ మహమ్మారిపై ఎలా పోరాడాలి అనే అంశంపై మాజీ అందాల భామలైన  ప్యూర్టో రికోకు చెందిన స్టెఫానీ డెల్ వల్లే (మిస్ వరల్డ్ 2016) మెక్సికో నుంచి వెనెస్సా పోన్స్‌ (మిస్ వరల్డ్ 2018) భారతదేశం నుంచి మానుషి చిల్లర్ (మిస్ వరల్డ్ 2017) పాల్గొని తమవంతు కృషి చేశారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని