భారత్‌ను చూడండి.. టాప్‌లోకి వెళ్తోంది..  - imran khan praises indian cricket team and says its becoming top team in world cricket
close
Published : 16/02/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ను చూడండి.. టాప్‌లోకి వెళ్తోంది.. 

ప్రపంచంలో మేటి జట్టుగా ఎదుగుతోంది: ఇమ్రాన్‌ఖాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్‌ఖాన్‌ భారత క్రికెట్‌ జట్టును కొనియాడారు. ప్రపంచంలో మేటి జట్టుగా టీమ్‌ఇండియా ఎదుగుతోందని కితాబిచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను చూడండి. ప్రపంచంలోనే మేటి జట్టుగా ఎదుగుతోంది. ఎందుకంటే.. వాళ్లు సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు’ అని ప్రశంసించారు.

అలాగే తమ దేశంలోనూ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారని పాక్‌ ప్రధాని పేర్కొన్నారు. కానీ, అలా మంచి ప్రణాళికతో ముందుకెళ్లడానికి, అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి సమయం పడుతుందని చెప్పారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్‌ కూడా ప్రపంచ క్రికెట్‌లో టాప్‌లో నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇటీవలే తమ క్రికెట్‌ ప్రణాళికలు మారినందున మెల్లిగా పాకిస్థాన్‌ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ మధ్య తనకు క్రికెట్‌ చూడటానికి కూడా సమయం దొరకడం లేదని ఇమ్రాన్‌ అన్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌లో 21 ఏళ్ల పాటు సేవలు అందించారు. 1971లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసి 1992లో అదే జట్టుపై చివరి వన్డే ఆడారు. ఈ క్రమంలోనే ఆ కాలంలో అత్యుత్తమ ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు.  అలాగే తన సారథ్యంలోనే ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని