ధోనీకి మనం చెప్పాల్సిన పనిలేదు: తాహిర్‌ - imran tahir says dhoni is a wonderful guy he loves to be in his team
close
Published : 01/02/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీకి మనం చెప్పాల్సిన పనిలేదు: తాహిర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా వార్త సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ సారథ్యంలో ఆడేందుకు తాను ఇష్టపడతానని చెప్పాడు. చెన్నై కెప్టెన్‌ అమోఘమైన వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తాడు.

‘ధోనీతో ఆడటం నా అదృష్టం. అతడితో కలిసి మూడేళ్లుగా ఆడుతున్నా. గొప్ప మనసున్న వ్యక్తి. ప్రతి ఒక్కర్నీ అర్థం చేసుకుంటాడు. అందర్నీ గౌరవిస్తాడు. అందుకే, ధోనీ అంటే అందరికీ అమితమైన ఇష్టం. ఆటపై అతడికి పూర్తి అవగాహన ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి. అతడికి మనం చెప్పాల్సింది ఏమీ ఉండదు. బౌలర్లకు అనుకూలంగా ఫీల్డింగ్‌ ఎలా సెట్‌ చేయాలనే విషయం ధోనీకి తెలుసు’ అని ఇమ్రాన్‌ వివరించాడు. 

అతడితో కలిసి ఉంటే చాలా నేర్చుకోవచ్చని, ఒక క్రికెటర్‌గా తనకు అదే కావాలని ఇమ్రాన్‌ పేర్కొన్నాడు. అలాగే తాను మరింత కాలం చెన్నై జట్టు తరఫున ఆడాలనే కోరికతో ఉన్నానని చెప్పాడు. గత మూడేళ్లుగా చెన్నై తరఫున ఆడుతున్న ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఐపీఎల్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 80 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే 2019 సీజన్‌లో చెన్నై తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు తీసుకొన్నాడు. అయితే, యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఆడి ఒక వికెట్‌ తీశాడు. మరి రాబోయే సీజన్‌లో ఈ స్పిన్‌ బౌలర్‌ ఏ మేరకు మాయ చేస్తాడో చూడాలి. 

ఇవీ చదవండి..
స్టార్క్‌ అవి బంతులా.. బుల్లెట్లా? 
అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని