‘మహా’ విజృంభణ.. నాలుగో రోజూ 8వేలు దాటాయ్‌! - in 4th day maharashtra reports 8000 covid cases
close
Published : 27/02/2021 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మహా’ విజృంభణ.. నాలుగో రోజూ 8వేలు దాటాయ్‌!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో తగ్గినట్టే కనిపించిన ఈ జిత్తులమారి వైరస్‌ మళ్లీ వణికిస్తోంది. మహారాష్ట్రలో వరుసగా నాలుగో రోజూ 8వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 8,6,23 కొత్త కేసులు బయటపడటంతో మొత్తం 21,46,777 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా 51 మరణాలు నమోదవ్వడంతో మొత్తం మరణాల సంఖ్య 52,092కి పెరిగింది. 

ఒక్క ముంబయి నగరంలోనే కొత్తగా 987 కేసులు నమోదవ్వగా.. నలుగురు మరణించారు. దేశంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉండగా.. ఆ తర్వాత స్థానంలో కేరళ కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో 40శాతం కేసులు (3401 కొత్త కేసులు) ముంబయి, పుణె, నాగ్‌పూర్‌, అమరావతి నగరాల్లోనే రావడం కలవరపెడుతోంది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 3,648 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన మొత్తం రోగుల సంఖ్య 20,20,951గా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 72,530 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని