మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ - in maha 4092 new covid-19 cases 40 die
close
Published : 15/02/2021 12:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ

39రోజుల తర్వాత మరోసారి 4వేలపైన కేసులు

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి అదుపుకావట్లేదు సరికదా.. వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదో రోజు.. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమేగాక, దాదాపు నెల రోజుల తర్వాత కొత్త కేసులు మరోసారి 4వేలపైకి చేరాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మరో 4,092 కొవిడ్‌ కేసులు బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య తాజాగా 20,64,278కి చేరింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 6న మహారాష్ట్రలో 4,382 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆదివారమే కేసుల సంఖ్య 4వేలను దాటింది. ఒక్క ముంబయిలోనే 645 వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయిలో ఇప్పటి వరకు 3,14,076 మంది కొవిడ్‌ బారిన పడగా.. 11,419 మంది మరణించారు. 

నిన్న మరో 1,355 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 19,75,603గా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 35,965 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో మరో 40 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 51,529 మంది వైరస్‌కు బలయ్యారు. 

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మరో రాష్ట్రం కేరళ నుంచి మహారాష్ట్రకు వచ్చేవారికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి చేసింది. ఇక దిల్లీ, గోవా, గుజరాత్‌, రాజస్థాన్‌ల నుంచి వచ్చేవారు కూడా తమ ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

నెమ్మదించిన కొవిడ్‌..!

కరోనా ఉన్న మాస్క్‌.. నీకే మంచిది గురూమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని