బాధ తట్టుకోలేక.. బాగా ఏడ్చేశా: అనసూయ - in some situations i do cry alot says anasuya
close
Published : 16/04/2021 15:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాధ తట్టుకోలేక.. బాగా ఏడ్చేశా: అనసూయ

హైదరాబాద్‌: ఒకానొక సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని నటి అనసూయ తెలిపారు. ఆ సమయంలో ఎంతో ఆవేదనకు లోనయ్యానని ఆమె అన్నారు. బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్‌ను ఆరంభించిన అనసూయ ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగానూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులను బయటపెట్టారు.

తాను ధరించే దుస్తులపై ఎన్నో సందర్భాల్లో నెటిజన్ల నుంచి నెగటివ్‌ కామెంట్లు వచ్చాయని ఆమె అన్నారు. అంతేకాకుండా తన పెద్దకుమారుడు సైతం.. తాను వెస్ట్రన్‌ దుస్తులు ధరిస్తే బాలేదని.. పొడవాటి దుస్తులు ధరించమని చెబుతాడని ఆమె తెలిపారు. అనంతరం ఎన్నో సందర్భాల్లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అనసూయ తెలిపారు. ‘కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ చాలాసార్లు ఆవేదనకు లోనయ్యాను. ఓసారి నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు.. కొన్నిరోజులకే ఆ అవకాశాలన్నీ చేజారిపోయాయి. అలాంటి సమయంలో నా భర్త దగ్గర కూర్చొని బాగా ఏడ్చేసేదాన్ని. ఆ బాధను పోగొట్టుకోవడం కోసం రాత్రి సమయంలో చాలా అరుదుగా వైన్‌ కూడా తాగుతుంటాను’ అని అనసూయ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని