టీమ్‌ఇండియా 365 ఆలౌట్‌ - india 365 all out in first innings
close
Updated : 06/03/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా 365 ఆలౌట్‌

త్రుటిలో శతకం కోల్పోయిన వాషింగ్టన్‌ సుందర్‌..

(PHOTO : BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: వాషింగ్టన్‌ సుందర్‌(96*; 174 బంతుల్లో 10x4, 1x6), అక్షర్‌ పటేల్‌(43; 97 బంతుల్లో 5x4, 1x6) రాణించడంతో టీమ్‌ఇండియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. చివర్లో అక్షర్‌, ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌ వరుసగా ఔటవ్వడంతో.. సుందర్‌ త్రుటిలో తొలి టెస్టు శతకాన్ని కోల్పోయాడు. 294/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన అక్షర్‌, వాషింగ్టన్‌ ఇంగ్లాండ్‌ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ శతక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆధిక్యాన్ని 160 పరుగులకు చేరవేశారు.

అయితే, రూట్‌ వేసిన 113వ ఓవర్‌ చివరి బంతికి వాషింగ్టన్‌ ఆడిన షాట్‌కు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అక్షర్‌ క్రీజు వదిలి ముందుకు వెళ్లాడు. బెయిర్‌స్టో వెంటనే స్పందించి బంతిని అందుకొని త్రో విసరడంతో అక్షర్‌ క్రీజులోకి చేరకముందే రూట్‌ బెయిల్స్‌ను ఎగర వేశాడు. దాంతో టీమ్‌ఇండియా 365 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. తర్వాతి ఓవర్‌లో స్టోక్స్‌ చివరి ఇద్దరి బ్యాట్స్‌మెన్‌ ఇషాంత్‌, సిరాజ్‌లను పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, శుక్రవారం పంత్‌(101; 118 బంతుల్లో 13x4, 2x6) అద్భుత శతకం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని