టీకా పంపిణీ: మూడో స్థానంలో భారత్‌! - india at third position in vaccination
close
Published : 18/02/2021 18:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీ: మూడో స్థానంలో భారత్‌!

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని భారత్ వేగంగా చేపడుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలోనే దాదాపు కోటి మందికి పంపిణీ చేసింది. ప్రపంచంలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రిటన్‌లు ముందుండగా, భారత్‌ మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రెండు నెలల క్రిందట వ్యాక్సినేషన్ ప్రారంభించిన అమెరికాలో ఇప్పటివరకు ఐదున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇక బ్రిటన్‌లోనూ ఇప్పటికే కోటిన్నర మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా భారత్‌ కూడా 94లక్షల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, అమెరికా, బ్రిటన్‌లు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించి 60రోజులు పూర్తికాగా, భారత్‌ మాత్రం 33రోజుల్లోనే దాదాపు కోటి మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగింది. జనవరి 16న భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కాగా, ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు ఇవ్వడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 94,22,228 వ్యాక్సిన్‌ డోసులను అందించగా, వీరిలో 61లక్షల 96వేల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకున్నారు. వీరిలో 3లక్షల మందికి రెండో డోసు కూడా ఇచ్చారు. వీరితో పాటు మరో 28లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు కూడా వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా 18కోట్ల మందికి..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 82దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టగా, దాదాపు 18కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో భారీ సంఖ్యలో అక్కడివారికి వ్యాక్సిన్ అందిస్తుండగా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌లలోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా‌ కొనసాగుతోంది. అటు ఇజ్రాయిల్‌, బ్రెజిల్‌ వ్యాక్సినేషన్‌ వేగంగా చేపడుతున్నాయి. అయితే, చైనాలోనూ వ్యాక్సినేషన్‌ భారీ స్థాయిలో చేపడుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే, ప్రైవేటు సంస్థల నివేదిక ప్రకారం, చైనాలో ఇప్పటికే దాదాపు 4కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇక కరోనా వ్యాక్సిన్‌ను మొట్టమొదటగా రిజిస్టర్‌ చేసుకున్న రష్యాలో మాత్రం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని