Corona: నాలుగో రోజూ 4 లక్షలకుపైనే కేసులు - india corona bulletin
close
Updated : 09/05/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: నాలుగో రోజూ 4 లక్షలకుపైనే కేసులు


దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,03,738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. నిన్న ఒక్క రోజే 4,092 మంది వైరస్‌కు బలయ్యారు.

* తాజా కేసులతో కలిసి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది.

* నిన్న 18,65,428 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.
* గడిచిన 24 గంటల్లో 4,092 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,42,362కి పెరిగింది.

* రోజువారీ కేసులతో పోల్చితే రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటకలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే 3,86,444 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 1,83,17,404కి చేరింది.

* ప్రస్తుతం దేశంలో 37,36,648 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* దేశంలో ఇప్పటి వరకూ 16,94,39,663 మందికి టీకా పంపిణీ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని