Corona : మూడో రోజూ తగ్గిన కేసులు - india corona bulletin
close
Updated : 16/05/2021 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona : మూడో రోజూ తగ్గిన కేసులు

మరోసారి 4వేలకుపైగా మరణాలు

దిల్లీ : భారత్‌లో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య మరోసారి 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరుసగా మూడోరోజు కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3,11,170 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక అంతక్రితం రోజు మరణాలు 4 వేల లోపు నమోదు కాగా.. తాజాగా 4,077 మంది కొవిడ్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

* తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది.
* తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2,70,284గా ఉంది

* నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే 3,62,437 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 2,07,95,335కి చేరింది.

* ప్రస్తుతం దేశంలో 36,18,458 క్రియాశీల కేసులు ఉన్నాయి.  

* శనివారం 18,32,950 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 31,48,50,143కి చేరింది.

* ఇక దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇప్పటి వరకూ టీకాలు తీసుకున్న వారి సంఖ్య 18,22,20,164గా ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని