Corona : 2.5లక్షలకు దిగువన కొత్త కేసులు - india corona bulletin
close
Updated : 23/05/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona : 2.5లక్షలకు దిగువన కొత్త కేసులు

దిల్లీ : దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 20 లక్షలకుపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసుల సంఖ్య 3 లక్షలలోపే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో 2,40,842 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. అంతక్రితం రోజు 4 వేలకుపైగా మరణాలు సంభవిస్తే.. తాజాగా 3,741 మంది ప్రాణాలు విడిచారు.

• తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,65,30,132గా ఉంది.

గడిచిన 24 గంటల్లో 3,741 మంది కొవిడ్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,99,266కు చేరింది.

గత కొన్ని రోజులుగా రికవరీలు భారీగా నమోదవుతుండటం ఊరట కలిగించే పరిణామం. తాజాగా 3,55,102 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,34,25,467కి పెరిగింది.

దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 28,05,399గా ఉంది

• నిన్న ఒక్క రోజే 21,23,782 పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 32.86 కోట్లకు చేరింది.

దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇప్పటి వరకూ 19.50 కోట్ల మందికి టీకాలు వేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని