Corona :20వేలకు దిగువన కేసులు.. 200 లోపు మరణాలు - india corona bulletin
close
Updated : 28/09/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona :20వేలకు దిగువన కేసులు.. 200 లోపు మరణాలు

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. తాజాగా  కొత్త కేసులు 20వేల లోపే నమోదుకావడం ఊరట కలిగిస్తోంది. 201 రోజుల అనంతరం కొత్త కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇక మరణాలు కూడా 200లోపే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 13,21,780 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,795 కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిన్న 179 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,47,373గా ఉంది.

కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. తాజాగా 26,030 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 32,9,58,002(97.81%)కి చేరింది.

• ప్రస్తుతం క్రియాశీల కేసులు 292206(0.87%) ఉన్నాయి.
• ఇక దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 1,02,22,525 మందికి టీకాలు పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 87 కోట్లు దాటింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని