300కు చేరువలో కరోనా మరణాలు! - india corona latest updates
close
Updated : 24/03/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

300కు చేరువలో కరోనా మరణాలు!

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కలవరపెడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే మంగళవారం కరోనా మరణాలు రికార్డు స్థాయిలో 275 నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 10.25లక్షల పరీక్షలు చేయగా.. 47,262 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది. కొత్తగా 23,907 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,12,05,160కు చేరి.. రికవరీ రేటు 95.67శాతానికి తగ్గింది.

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 199 నమోదు కాగా.. మంగళవారం రికార్డు స్థాయిలో 275 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,60,441కి చేరింది. ఇక మరణాల రేటు 1.37 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  3,68,457 కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. గడిచిన 24గంటల్లో 23.46లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 5,08,41,286కి చేరింది.

మహారాష్ట్రలో 132 మంది మృత్యు ఒడికి
దేశంలో మహారాష్ట్రలోనే కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 28వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు 132 మంది వైరస్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక రికవరీల విషయానికొస్తే 13,165 మంది తాజాగా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని