corona:మరోసారి 4వేలకుపైగా మరణాలు - india corona update
close
Updated : 21/05/2021 10:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

corona:మరోసారి 4వేలకుపైగా మరణాలు

2.59లక్షల కొత్త కేసులు

వరుసగా 8వరోజూ రికవరీలే ఎక్కువ

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. నిన్న మృతుల సంఖ్య మరోసారి నాలుగువేలకు పైగా నమోదైంది. అలాగే 2.59లక్షల మంది వైరస్ బారిన పడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గురువారం 20,61,683 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,59,551 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చుకుంటే కొత్తకేసులు స్వల్పంగా తగ్గాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకోట్ల 60లక్షల మార్కును దాటింది. 24గంటల వ్యవధిలో 4,209 మంది ప్రాణాలు వదిలారు. క్రితంరోజు ఆ సంఖ్య 3,874గా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే 984 మంది చనిపోయారు. ఇప్పటివరకు 2,91,331మంది ప్రాణాలు గాల్లోకలిశాయి. అయితే వరసగా మూడురోజులుగా 20లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసులు మూడులక్షలకు దిగువనే నమోదు అవుతున్నాయి.

ఇక, క్రియాశీల కేసుల్లో తగ్గుదల, రికవరీల్లో పెరుగుదల సానుకూల అంశాలు. ప్రస్తుతం 30,27,925 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 11.63 శాతానికి తగ్గింది. వరసగా ఎనిమిదో రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న 3,57,295 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.27కోట్ల మందికిపైగా కోలుకోగా..రికవరీ రేటు 87.25 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 14,82,754 మంది టీకాలు అందాయి. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని