కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 312 మంది మృతి! - india corona update
close
Updated : 28/03/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి: ఒకేరోజు 312 మంది మృతి!

దిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్తగా నమోదైన కేసుల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ.. మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో 11.81లక్షల పరీక్షలు చేయగా.. 62,714 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కి చేరింది. కొత్తగా 28,739 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,13,23,762కు చేరి.. రికవరీ రేటు 94.85శాతానికి తగ్గింది.

ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 291 నమోదు కాగా.. శనివారం ఆ సంఖ్య మరింత పెరిగి 312 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,61,552కి చేరింది. ఇక మరణాల రేటు 1.35 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  4,86,310కి పెరిగింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగానే సాగుతోంది. గడిచిన 24గంటల్లో 21.54లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 6,02,69,782కి చేరింది.

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. శనివారం ఒక్కరోజే 35,726 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 166 మరణాలు నమోదు కాగా, 14,523 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 26.73లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23.14లక్షల మంది కోలుకోగా.. 54,073 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3.04లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని