ఆ దేశాల కంటే భారత్‌లో కొవిడ్‌ మరణాలు ఎక్కువే! - india covid deaths higher than s asian nations
close
Published : 02/02/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ దేశాల కంటే భారత్‌లో కొవిడ్‌ మరణాలు ఎక్కువే!

కారణాలను వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రతలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌, కొవిడ్‌ మరణాల్లో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. అయితే, వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌ మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ, దక్షిణాసియా దేశాలతో పోలిస్తే ప్రతి మిలియన్‌ జనాభాకు కొవిడ్‌ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి వివిధ అంశాలు కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రతి పదిలక్షల మంది జనాభాకు భారత్‌లో 112 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణాసియా దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌లో కొవిడ్‌ మరణాలతో పోలిస్తే భారత్‌లోనే ఇవి ఎక్కువ. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే రాజ్యసభలో ధ్రువీకరించారు. అయితే, ఆ దేశాలతో పోల్చడం సముచితం కాదని స్పష్టంచేశారు. ఆయా దేశాల భౌగోళిక స్వరూపం, కొవిడ్‌ కేసు, కొవిడ్‌ మరణాల నిర్వచనం, పర్యవేక్షణ, పరీక్షలు, కేసు నమోదు విధివిధానాలు వేరువేరుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా అంశాల ఆధారంగా అక్కడ కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండవచ్చని అశ్విని కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌ మరణాలు చాలా తక్కువని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో ప్రతి పదిలక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది. అమెరికాలో ప్రతి మిలియన్ జనాభాకు 1347, యూకేలో 1533, స్పెయిన్‌లో 1247, బ్రెజిల్‌లో 1044, రష్యాలో 495 మంది చనిపోతున్నారు. కానీ, బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ దేశాల్లో ప్రతి పదిలక్షల జనాభాకు భారత్‌ కంటే తక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా రికవరీ రేటు 96.94శాతం ఉండగా, మరణాల రేటు 1.44శాతంగా ఉంది.

ఇవీ చదవండి..
కొవిడ్‌ మహమ్మారికి..160 మంది వైద్యులు బలి
కరోనా ఉద్ధృతి: కేరళ, మహారాష్ట్రకు కేంద్ర బృందాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని