మాల్దీవులకు చేరిన భారత్‌ టీకాలు - india dispatches first consignment of covishield vaccines to maldives
close
Published : 20/01/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాల్దీవులకు చేరిన భారత్‌ టీకాలు

దిల్లీ: పొరుగు, కీలక భాగస్వామ్య దేశాలకు ఔషధ ఉత్పత్తుల సహకార ఒప్పందంలో భాగంగా భారత్‌ ఆరు దేశాలకు భారత్‌ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని  విమానాశ్రయం నుంచి మాల్దీవులకు కొవిషీల్డ్‌ లక్ష డోసులను ఎగుమతి చేసింది. టీకాలను తీసుకెళ్లే విమానం ముందుగా తిరువనంతపురం చేరుకొని అక్కడి నుంచి మాల్దీవుల్లోని మాలెకు చేరుకుంది. బుధవారం ఉదయం సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి భూటాన్‌కు కూడా 1.5 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేశారు.

మాల్దీవులకు వ్యాక్సిన్‌ చేరుకోవడంతో ఆ దేశ పార్లమెంట్‌ సభాపతి మహ్మద్‌ నషీద్‌ భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ రోజు ఎయిరిండియా విమానంలో లక్ష  వ్యాక్సిన్‌లను భారత్‌ నుంచి బహుమతిగా పొందాం. కష్ట సమయాల్లో ఆదుకొనే స్నేహితుడిగా భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది.’’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘పొరుగు దేశాలకు ప్రాధాన్యతనిచ్చి సహాయం చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు.’’ అని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు.

2019లో మాల్దీవుల పర్యటనకు వెళ్లిన ప్రధాని పొరుగునున్న దేశాలే మనకు మొదటి ప్రాధాన్యం అని పేర్కొన్నారు. గతేడాది నవంబరులో విదేశాంగశాఖ కార్యదర్శి మాల్దీవుల పర్యటనకు వెళ్లినపుడు వ్యాక్సిన్‌లు సిద్ధమైన తర్వాత మాల్దీవులకు మొదటి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. మాల్దీవుల జనాభా ఐదు లక్షలుండగా భారత్‌ పంపినవి కాకుండా మిగతా వ్యాక్సిన్లను సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. వ్యాక్సిన్లే కాకుండా కరోనా సంక్షోభంలో భారత్‌ మాల్దీవులకు అండగా నిలిచింది. కరోనా కారణంగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఆపరేషన్‌ సంజీవని పేరుతో భారత్‌ మాల్దీవులకు వైద్య సహకారాన్ని అందించింది.

ఇవీ చదవండి..

టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే..

భారత్‌ రెండు టీకాలు సురక్షితమే..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని