ఇంగ్లాండ్‌ బలహీనత బయటపెట్టిన కోహ్లీసేన - india exposed our weakness in handling slow conditions says morgan
close
Published : 16/03/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌ బలహీనత బయటపెట్టిన కోహ్లీసేన

నెమ్మది పరిస్థితుల్లో తగిన అనుభవం లేదన్న మోర్గాన్‌

అహ్మదాబాద్‌: రెండో టీ20లో టీమ్‌ఇండియా తమ బలహీనతలను బయట పెట్టిందని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. నెమ్మది పిచ్‌లపై ఇబ్బంది పడే తమ బలహీనతను కోహ్లీసేన సొమ్ము చేసుకుందని పేర్కొన్నాడు. కానీ  ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు తమ ముందున్న ఏకైక దారి ఇదేనని వెల్లడించాడు. మ్యాచులో ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.

‘ప్రస్తుత పిచ్‌కు మా ఆటతీరుకు మధ్య వ్యత్యాసం ఉంది. తొలి మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌లో మంచి వేగం ఉంది. ఇప్పటి వికెట్‌ మందకొడిగా ఉంది. అది మా బలహీనతను బయటపెట్టింది. మేం ఎక్కువగా నెమ్మది పిచ్‌లపై ఆడలేడు. వాటిపై ఎంత ఎక్కువగా ఆడితే అంతగా మెరుగవుతాం. పొరపాట్లు చేస్తూ వీటిపై ఎక్కువగా ఆడితేనే నెమ్మది పరిస్థితులను అధిగమించగలం’ అని మెర్గాన్‌ అన్నాడు.

‘తొలి మ్యాచ్‌ వికెట్‌ మాకు బాగా నప్పింది. ఎందుకంటే అందులో చక్కని వేగం ఉంది. ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్‌ పిచ్‌లా అనిపించింది. కానీ ఈ పిచ్‌ మాత్రం మమ్మల్ని సౌకర్యవంతమైన జోన్‌ నుంచి బయటపడేసింది. ఐపీఎల్‌లో ఆడే వికెట్‌లా అనిపించింది. ఏదేమైనా మేం మరింత కచ్చితత్వంతో ఆడాలి. వేగంగా నేర్చుకోవాలి. తొలుత మా ఇన్నింగ్స్‌ను అనుకున్నట్టే ఆరంభించాం. భాగస్వామ్యాలు నెలకొల్పాం. దూకుడు పెంచే క్రమంలో వివిధ దశల్లో వికెట్లు చేజార్చుకున్నాం. ఛేదనలో త్వరగా వికెట్‌ తీయడం తెలివైన పనే. కానీ టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంది. కోహ్లీ, కిషన్‌ దూకుడుగా ఆడి మాపై ఆధిపత్యం చెలాయించారు. వారిపై మా ప్రయత్నాలు వృథానే అయ్యాయి’ అని మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని