Vaccine: 33కోట్ల మార్కును దాటిన డోసుల పంపిణీ - india has taken a distinct lead in total vaccine doses administered in the world.
close
Published : 29/06/2021 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: 33కోట్ల మార్కును దాటిన డోసుల పంపిణీ

జోరుగా టీకా పంపిణీ కార్యక్రమం

దిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్లు కలవరం పుట్టిస్తోన్న వేళ.. టీకా కార్యక్రమంలో వేగం పుంజుకోవడం ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..33 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ముందంజలో ఉందని వెల్లడించింది. జూన్ 21-28 నుంచి సగటున రోజుకు 57.68లక్షల డోసులు వేసినట్లు పేర్కొంది. అయితే ఆదివారం మాత్రం ఆ సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అలాగే మే 1 నుంచి జూన్‌ 24 మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లో 56 శాతం డోసులు, పట్టణ ప్రాంతాల్లో 44 శాతం డోసుల్ని పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 27.27 కోట్ల మంది మొదటి డోసును స్వీకరించారు. 5.84 కోట్ల మందికి రెండు డోసులు అందాయి. 

కేసుల్లో 91 శాతం తగ్గుదల..
రెండో దఫా వైరస్ విజృంభణలో మే 7న రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. అప్పుడు నాలుగు లక్షలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. ప్రస్తుతం 40వేల దిగువకు చేరాయి. పాజిటివ్‌ కేసులు 91 శాతం క్షీణించాయి. వారపు సగటు పాజిటివిటీ రేటు 5 శాతం దిగువనే నమోదవుతోంది. ప్రస్తుతం అది 2.74 శాతంగా ఉంది. రోజువారీ సగటు పాజిటివిటీ రేటు 22 రోజులుగా 5 శాతంలోపే ఉంటోంది. ఇక మే 3 నుంచి రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 96.9 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు ఐదు లక్షలకు తగ్గగా..రెండు రోజులుగా మరణాలు వెయ్యి దిగువనే నమోదవుతున్నాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని