శ్రీలంకతో ఇండియా లెజెండ్స్‌ అమీతుమీ - india legends vs sri lanka legends will fight in road safety finals on sunday
close
Updated : 20/03/2021 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీలంకతో ఇండియా లెజెండ్స్‌ అమీతుమీ

రేపే రోడ్‌ సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌..

(Photo: Sachin Tendulkar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ దిగ్గజాలతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ సిరీస్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని షాహీద్‌వీర్‌ నారాయణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా లెజెండ్స్‌, శ్రీలంక లెజెండ్స్‌ తలపడనున్నారు. గతరాత్రి దక్షిణాఫ్రికా లెజెండ్స్‌ను చిత్తు చేయడంతో లంక లెజెండ్స్‌ ఫైనల్‌ చేరింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం భారత్‌తో తలపడనున్నారు.

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సిరీస్‌ నిజానికి గతేడాది మార్చిలో ప్రారంభమైంది. మొత్తం ఏడు జట్లు పోటీపడగా, చివరికి భారత్‌, లంక జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి. 2020 మార్చి 7న ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి పోరు జరిగింది. తర్వాత దేశంలో కరోనా కేసుల ప్రభావంతో నాలుగు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ వాయిదా పడింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 11 నుంచి మిగతా మ్యాచ్‌లను నిర్వహించగా భారత్‌ వరుస విజయాలతో దూసుకెళ్లింది. సచిన్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లు మునుపటి రోజుల్ని గుర్తుకు తెస్తూ భారత్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

ఇక గతరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణఫ్రికాను నువాన్‌ కులశేఖర 5/25 కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ వాన్‌వింక్‌(53; 47 బంతుల్లో 8x4) ఒక్కడే రాణించాడు. ఆపై లంక బ్యాట్స్‌మెన్‌ ఉపుల్‌ తరంగా(39*; 44 బంతుల్లో 5x4), చింతక జయసింగే(47*; 25 బంతుల్లో 8x4, 1x6) రాణించడంతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రేపు భారత్‌, శ్రీలంక జట్లు తుదిపోరులో తలపడనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని