ధోనీలా కిషన్‌, పంత్‌: కోహ్లీసేన అదృష్టం! - india lucky to have 2 players like ms dhoni in rishabh pant and ishan kishan says saba karim
close
Published : 16/03/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోనీలా కిషన్‌, పంత్‌: కోహ్లీసేన అదృష్టం!

మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోనీలా బ్యాటింగ్‌ చేయగల రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ దొరకడం టీమ్‌ఇండియా అదృష్టమని మాజీ వికెట్‌ కీపర్‌ సాబా కరీమ్‌ అన్నారు. భవిష్యత్తులోనూ వీరిద్దరూ భారత్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా వేశారు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20కి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి పంత్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. రెండో టీ20లో అరంగేట్రం చేసిన కిషన్‌ ఐపీఎల్‌ దూకుడునే కొనసాగించాడు.

‘ఇద్దరు ధోనీలు దొరికారంటే టీమ్‌ఇండియాకు అంతకన్నా ఇంకేం కావాలి. రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా, నిర్భయంగా, స్వేచ్ఛగా ఆడుతున్నారు. వాళ్ల పాత్రలేంటో వారికి స్పష్టంగా తెలుసు. అంతేకాకుండా వారిద్దరూ లెక్కపెట్టినట్టుగా రిస్క్‌ తీసుకుంటున్నారు. మ్యాచ్‌ విజేతలమని నిరూపించుకొనేందుకే వారిద్దరూ ఆడుతున్నారు. ఇంతకుముందే పంత్‌ నిరూపించుకున్నాడు. ఇప్పుడు కిషన్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వీరిద్దరి వైఖరీ ఒకేలా ఉంది’ అని కరీమ్‌ అన్నారు.

‘పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియాకు ఇద్దరు మ్యాచ్‌ విజేతలు దొరకడం అదృష్టమే. భవిష్యత్తులో వీరిద్దరూ భారత్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తారన్న నమ్మకం ఉంది. పంత్‌, కిషన్‌ 2016లో అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడారు. అందుకే వారి పునాదులు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో వారి బాధ్యతలేంటో వారికి తెలుసు. తమను తాము ఎలా నిరూపించుకోవాలో తెలుసు’ అని కరీమ్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని