టీమ్‌ఇండియా-ఏ, టీమ్‌ఇండియా-బిని దించొచ్చు: శాస్త్రి - india might as well field two playing elevens in future says ravi shastri
close
Published : 10/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియా-ఏ, టీమ్‌ఇండియా-బిని దించొచ్చు: శాస్త్రి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బయో బుడగల్లో ఉండటం కష్టమే అయినప్పటికీ టీమ్‌ఇండియాకు మాత్రం కాస్త మేలే జరిగిందని కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఆరు నెలల క్రితం ఊహించలేని విధంగా ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు వచ్చాయని పేర్కొన్నాడు. మైదానంలోకి భారత్‌ రెండు జట్లను పంపగలదని వెల్లడించారు. ఇంగ్లాండ్‌ టీ20 సిరీసుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

‘టీమ్‌ఇండియాకు ఇంతమంది క్రికెటర్లు ఆడగలరని ఆరు నెలల క్రితం ఎవ్వరం ఊహించి ఉండం. భారీ బృందంగా పర్యటనలకు వెళ్లడాన్ని చూసుకుంటే బుడగల వల్ల జట్టుకు జరిగిన మేలు ఇదే. సాధారణంగా 17-18 మంది ఆటగాళ్లను పర్యటనలకు ఎంపిక చేస్తారు. బుడగలు, కరోనా ఆంక్షల వల్ల ఈ సారి 25-30 లేదా అంతకన్నా ఎక్కువమందితో వెళ్తున్నాం. దీంతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసేందుకు కూలంకషంగా ఆలోచించాల్సి వస్తోంది. అదృష్టమో దురదృష్టమో మేం 30 మందితో ఆడాల్సి వచ్చింది. ఎవరు బాగా ఆడతారు ఎవరు ఆడరో తెలిసింది. ఈ విధానం బాగా పని చేసింది’ అని రవిశాస్త్రి అన్నాడు.

ప్రస్తుత ప్రదర్శనలను బట్టి చూస్తే భవిష్యత్తులో రెండు వేర్వేరు జట్లను భారత్‌ మైదానంలోకి దించగలదని అనిపిస్తోందని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2021లో తీరిక లేని షెడ్యూలుతో సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చినా ఇబ్బందేమీ లేదని పేర్కొన్నాడు. ‘ఇలాంటివి మనం ఊహించలేం. కానీ పరిస్థితులు వాటిని సాకారం చేశాయి. అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్న కుర్రాళ్లను చూస్తే సంతోషమేస్తోంది. ఇప్పుడు భారత్‌ రెండు జట్లను బరిలోకి దించగలదు’ అని ఆయన వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని