సెల్‌ఫోన్‌ వినియోగంలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌ - india ranks 3rd on average smartphone usage globally
close
Updated : 27/07/2021 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెల్‌ఫోన్‌ వినియోగంలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెల్ ఫోన్‌లను అధికంగా ఉపయోగించే దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో ఉన్నట్లు జెడ్ డీ నెట్ న్యూస్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు అత్యధిక వినియోగంలో తొలిస్థానంలో బ్రెజిల్ రెండో స్థానంలో ఇండోనేషియా ఉన్నట్లు జెడ్ డీ నెట్ న్యూస్ వెబ్ సైట్ నివేదిక పేర్కొంది. బ్రెజిల్ ప్రజలు ఒక రోజులో సగటున 5 గంటల 4 నిమిషాలు, ఇండోనేషియన్లు 5 గంటల 3 నిమిషాల పాటు చరవాణి వాడుతున్నట్లు తెలిపింది. భారతీయులు ప్రతిరోజు 4 గంటల 9 నిమిషాల పాటు సెల్ ఫోన్  వినియోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. నాలుగో స్థానంలో ఉన్న దక్షిణకొరియా వాసులు ఒకరోజులో 4 గంటల 8 నిమిషాలు, ఐదో ర్యాంకులో ఉన్న మెక్సికన్లు 4 గంటల 7 నిమిషాల పాటు సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. టర్కీ, జపాన్, కెనడా, అమెరికా, యూకే ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని