72గంటలు.. 10లక్షల కేసులు.. 7వేల మరణాలు - india records 10 lakh covid cases in just 3 days
close
Updated : 24/04/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

72గంటలు.. 10లక్షల కేసులు.. 7వేల మరణాలు

భారత్‌లో కరోనా లెక్కలివి..

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. మునుపటితో పోలిస్తే అత్యంత వేగంగా విరుచుకుపడుతోంది. భారత్‌లో తొలి 10లక్షల కేసులు నమోదవడానికి దాదాపు 150 రోజులు పట్టగా.. రెండో దశలో కేవలం మూడంటే మూడు రోజుల్లోనే దాదాపు 10లక్షల కొత్త కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. గడిచిన 72 గంటల్లో దేశంలో 10లక్షల కొత్త కేసులు నమోదవగా.. దాదాపు 7వేల మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తోంది.
 
మూడు రోజుల క్రితం దేశంలో తొలిసారిగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3లక్షలు దాటింది. ఏప్రిల్‌ 21 ఉదయం 8 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో 3,14,835 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత వరుసగా రోజువారీ కేసులు 3.32లక్షలు, 3.46లక్షల పైనే నమోదయ్యాయి. ఇక వరుసగా నాలుగో రోజు మరణాల సంఖ్య 2వేల పైనే ఉంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 25లక్షలు దాటడం గమనార్హం.

74శాతం కేసులు 10 రాష్ట్రాల్లో

రెండు దశలో తొలుత మహారాష్ట్రలో కరోనా విజృంభించింది. అయితే ఇప్పుడు చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 74.15శాతం కేసులు 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర సహా దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌లలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 12 రాష్ట్రాల్లో కేసులు నానాటికీ పైపైకి పోతున్నాయి. 

కాస్త ఊరటనిస్తోన్న రికవరీలు.. 

అయితే రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో వస్తున్నప్పటికీ రికవరీలు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 2.19లక్షల మంది వైరస్‌ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1.38కోట్లు దాటింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని