India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు - india reports 259170 new covid19 cases
close
Updated : 20/04/2021 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు

దిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి దేశం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో భారత్‌ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,19,486 కొవిడ్ పరీక్షలు జరపగా.. 2,59,170 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,53,21,089కి చేరింది. అయితే అంతక్రితం రోజు(2.73లక్షలు)తో పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గినప్పటికీ మరణాలు మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. 

ఇక 24 గంటల వ్యవధిలో మరో 1761 మంది వైరస్‌ వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1,80,530 మంది వైరస్‌కు బలవ్వగా.. మరణాల రేటు 1.18శాతానికి చేరింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,31,977 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 13.26శాతానికి పెరిగింది. తాజాగా మరో 1,54,761 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 1,31,08,582 మంది వైరస్‌ను జయించారు. 

ఇక మహారాష్ట్ర, దిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోంది. మహారాష్ట్రలో నిన్న 58,924 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. 351 మరణాలు చోటుచేసుకున్నాయి. దిల్లీలో 23,686కేసులు, 240 మరణాలు నమోదయ్యాయి. యూపీలో 28,211 కేసులు, 167 మరణాలు సంభవించాయి.

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. సోమవారం 32,76,555 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 12,71,29,113 మంది టీకా తీసుకున్నారు. మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకునేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని