ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డు - india the first team to beat england in three t20 series after 2016 t20 world cup
close
Published : 21/03/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాదే కొత్త రికార్డు

ఐదో టీ20లో నమోదైన మరిన్ని రికార్డులు..

(Photo:BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్‌ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌పై అత్యధికంగా మూడుసార్లు పొట్టి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ జట్టుపై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్‌గా భారత్‌ అవతరించింది.

మొతేరా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 224/2 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4x4, 5x6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(80నాటౌట్‌; 52 బంతుల్లో 7x4, 2x6) రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్‌ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా, కోహ్లీ నిలకడగా ఆడాడు. అలా వీరిద్దరూ 9 ఓవర్లకే జట్టు స్కోరును 90 పరుగులు దాటించారు. ఇక 94 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాక గేర్‌ మార్చిన కోహ్లీ.. సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్‌ పాండ్య(37నాటౌట్‌; 17 బంతుల్ల్లో 4x4, 2x6)తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. ఆపై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జాస్‌ బట్లర్‌(52; 34బంతుల్లో 2x4, 4x6), డేవిడ్‌ మలన్‌(68; 46 బంతుల్లో 9x4, 2x6) దంచికొట్టినా ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చివరికి ఆ జట్టు 188/8తో సరిపెట్టుకొని ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..

* పొట్టి క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోర్‌ 224/2. 2007లో ఇదే జట్టుపై 218/4 స్కోర్‌ సాధించింది. ఇక మొత్తంగా ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్‌ కావడం విశేషం.

* ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు బాబర్‌ అజామ్‌ 26, విరాట్‌ కోహ్లీ 27, ఆరోన్‌ ఫించ్‌, కేఎల్‌ రాహుల్‌ చెరో 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

* ఇక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు(1,502) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 45 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు చేరుకున్నాడు. అంతకుముందు ఆరోన్‌ఫించ్‌ 44 మ్యాచ్‌ల్లో 1,462 పరుగులు, కేన్‌ విలియమ్సన్‌ 49 మ్యాచ్‌ల్లో 1,383 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* అలాగే ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతడు మొత్తం 231 పరుగులు సాధించాడు. దీంతో 2020లో న్యూజిలాండ్‌పై కేఎల్‌ రాహుల్‌ సాధించిన 224 పరుగుల రికార్డును అధిగమించాడు. ఇక 2018లో కొలిన్‌ మన్రో వెస్టిండీస్‌పై 223 పరుగులు సాధించడంతో మూడోస్థానంలో ఉన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని