దేశవ్యాప్తంగా మరోసారి వ్యాక్సిన్‌ డ్రైరన్‌! - india to conduct second vaccine dry run across all districts on jan 8
close
Published : 07/01/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశవ్యాప్తంగా మరోసారి వ్యాక్సిన్‌ డ్రైరన్‌!

దిల్లీ: కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్న తరుణంలో మరోసారి దేశవ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడత డ్రైరన్‌ను ఈ నెల 8న  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. ‘తొలి విడతలో భాగంగా ప్రాధాన్యత వర్గాల వారీగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించేందుకు దేశం సిద్ధంగా ఉంది. ఈ డ్రైరన్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 700 జిల్లాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. యూపీ, హరియాణాల్లో మాత్రం జనవరి 5, జనవరి 7న ఉంటుంది’ అని వెల్లడించింది. అంతేకాకుండా డ్రైరన్‌ నిర్వహణ రోజున సాయంత్రం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో వర్చవల్‌ భేటీ నిర్వహించనున్నట్లు పేర్కొంది.   

దేశంలో తొలి విడతలో 30 కోట్ల జనాభాకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సంసిద్ధతను పరీక్షించడానికి జనవరి 2న తొలిసారి ‘డ్రైరన్‌’ ప్రక్రియ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ డ్రైరన్‌ ప్రక్రియ ద్వారా వ్యాక్సినేషన్‌ కోసం రూపొందించిన ‘కోవిన్‌’ అప్లికేషన్‌ క్షేత్ర స్థాయి పనితీరును పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. 

భారత్‌లో దేశీయంగా రూపొందించిన కోవాగ్జిన్‌(భారత్‌ బయోటెక్‌), కొవిషీల్డ్‌(సీరం ఇన్‌స్టిట్యూట్‌ ) కరోనా టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై గతవారం డ్రైరన్‌ నిర్వహించిన సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రభుత్వం గత నాలుగు నెలల నుంచి సన్నద్ధమవుతోందని చెప్పారు. మరోవైపు దేశంలో కొత్త రకం స్ట్రెయిన్‌ కరోనా కేసుల సంఖ్య 73కు చేరింది.  
ఇదీ చదవండి

దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని