చెన్నై టెస్టు: టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 337 - india total in first innings 336
close
Updated : 08/02/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెన్నై టెస్టు: టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 337

రెండో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. 257/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 80 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు వాషింగ్టన్‌ సుందర్‌ (85*; 138 బంతుల్లో 12x4, 2x6), రవిచంద్రన్‌ అశ్విన్‌(31; 91 బంతుల్లో 3x4, 1x6) ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో రోజు ఉదయం చక్కగా ఆడుతున్న వీరిని జాక్‌ లీచ్‌ దెబ్బ కొట్టాడు. అతడు బంతి అందుకొని స్వల్ప వ్యవధిలో అశ్విన్‌, నదీమ్‌(0)లను ఔట్‌ చేశాడు. ఆపై అండర్సన్‌.. ఇషాంత్‌(4), బుమ్రా(0)ను ఔట్‌ చేయడంతో భారత్‌ 95.5 ఓవర్లలో ఆలౌటైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్‌ నాలుగు వికెట్లు తీయగా.. అండర్సన్‌, ఆర్చర్‌, లీచ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో‌ 241 పరుగుల వెనుకంజలో నిలిచింది.

అయితే, టీమ్‌ఇండియాను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం దక్కినా ఇంగ్లాండ్‌ వదులుకుంది. తిరిగి ఆ జట్టే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కోహ్లీ బంతిని నేరుగా అశ్విన్‌కు అందివ్వడంతో తొలి బంతికే వికెట్‌ దక్కింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ రోరీబర్న్స్‌ స్లిప్‌లో రహానె చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే ఒక వికెట్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో భోజన విరామ సమయానికి పర్యాటక జట్టు 2 ఓవర్లకు 1/1తో నిలిచింది. క్రీజులో సిబ్లీ, లారెన్స్‌ ఉన్నారు. 

ఇవీ చదవండి..
ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగు
అది దురదృష్టం.. ఏమీ చేయలేను: పుజారా


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని