Taliban: అఫ్గాన్‌ గడ్డ.. ఉగ్రవాదుల అడ్డాగా మారొద్దు! - india us call on taliban to adhere to commitments
close
Updated : 25/09/2021 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Taliban: అఫ్గాన్‌ గడ్డ.. ఉగ్రవాదుల అడ్డాగా మారొద్దు!

తాలిబన్లకు తేల్చి చెప్పిన భారత్‌-అమెరికా

వాషింగ్టన్‌ : అఫ్గానిస్థాన్‌లో పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారత్‌, అమెరికా సూచించాయి. మహిళలు, చిన్నారులు సహా పౌరుల హక్కులను గౌరవించాలని హితవు పలికాయి. అఫ్గాన్‌ను ఉగ్రవాదుల శిక్షణకు స్థావరంగా మార్చొద్దని తేల్చి చెప్పాయి. ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే శక్తులకు అఫ్గాన్ భూభాగాన్ని కేంద్రంగా మార్చొద్దని సూచించాయి. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ శుక్రవారం తొలిసారి ముఖాముఖీ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన వారు అఫ్గాన్‌లో ఉగ్రవాదంపై ప్రధానంగా ప్రస్తావించారు.

ఉగ్రవాద నిర్మూలనకు తాలిబన్‌ ప్రభుత్వం కృషి చేయాలని భారత్‌-అమెరికా సూచించాయి. ఉగ్రమూకలకు నిధుల అందజేతనూ అడ్డుకోవాలని స్పష్టం చేశాయి. అలాగే అఫ్గానిస్థాన్‌ను వీడాలనుకుంటున్న అఫ్గాన్లు, విదేశీయులను సురక్షితంగా పంపాలని కోరాయి. అఫ్గానిస్థాన్‌కు మానవతా దృక్పథంతో అందే సాయాన్ని తాలిబన్లు అనుమతించాలని హితవు పలికాయి. శాంతియుతమైన అఫ్గాన్‌ నిర్మాణంలో ఇతర మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని